ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

11AM TOP NEWS: ప్రధాన వార్తలు @ 11am - 11AM TOP NEWS

.

ప్రధాన వార్తలు @ 11am
ప్రధాన వార్తలు @ 11am

By

Published : Feb 6, 2022, 11:00 AM IST

  • దివికేగిన అమృతగానం.. లతా మంగేష్కర్ అస్తమయం

భారతీయులు గర్వించదగ్గ పాటలు పాడి చరిత్రలో నిలిచిన గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. అనేక రోజులుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఓ నేపథ్య గాయకురాలిగా మొదలైన ఆమె.. ప్రఖ్యాత గాయనిగా పేరు తెచ్చుకున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లతా మంగేష్కర్​ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

గాయని లతా మంగేష్కర్​కు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ' భారత రత్న, లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి' అని ట్వీట్​ చేశారు. లెజెండరీ సింగర్​ లతా మంగేష్కర్​ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లతా మంగేష్కర్.. నటిగా ఎంట్రీ, స్టార్ సింగర్​గా చరిత్ర!

ప్రముఖ గాయని లతా మంగేష్కర్​.. అనారోగ్య సమస్యతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నటిగా కెరీర్​ మొదలుపెట్టి.. భారతదేశం గర్వించదగ్గ సింగర్​గా​ ఎలా ఎదిగారో చెప్పేదే ఈ ప్రత్యేక కథనం.

  • Lata Mangeshkar: ఏడు దశాబ్దాల ప్రయాణం.. వేల గీతాల నిలయం

తన గాన మాధుర్యంతో శ్రోతల మనుసు దోచుకున్న లతా మంగేష్కర్​ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అభిమానుల్ని కంటతడి పెట్టిస్తూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆమె సంగీత ప్రయాణంపై ప్రత్యేక కథనం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • RTC EMPLOYEES: చర్చలు సఫలం.. సమ్మెను విరమిస్తున్నాం: ఆర్టీసీ ఐకాస

రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను విరమించినట్లు ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. పీఆర్సీ సాధన సమితితో ప్రభుత్వ చర్చలు సఫలమైనందున.. సమ్మెను విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. ఈ మేరకు 14 సంఘాలతో కూడిన ఆర్టీసీ ఐకాస ప్రకటన విడుదల చేసింది. ఇవాళ నల్లబ్యాడ్జిలు ధరించడం, ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • UTF LEADER: ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలం: యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమైనట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని స్పష్టం చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • FIRE ACCIDENT: బొడ్డపాడులో అగ్ని ప్రమాదం..15 పూరిళ్లు దగ్దం

శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 పూరిల్లు దగ్ధమయ్యాయి. అర్థరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎలిజబెత్‌ రాణి-2 పాలనకు ప్లాటినం జూబ్లీ

క్వీన్​ ఎలిజబెత్​-2 బ్రిటిష్​ గద్దెనెక్కి నేటికి 70 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా బ్రిటన్​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. సూదీర్ఘకాలం పాటు బ్రిటన్​ను పారిపాలించిన ఏకైక రాజవంశానికి చెందిన మహిళ ఈమనే కావడం విశేషం.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • BCCI Prize Money: కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన యువ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.40లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'పోస్టర్​పై నా పేరు వేయండి: హీరో రవితేజ'

'రాక్షసన్​' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విష్ణు విశాల్​ చేస్తున్న కొత్త సినిమా 'ఎఫ్​.ఐ.ఆర్'​. దానికి ఆయనే నిర్మాత. ఈ సినిమాను తెలుగులో మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 'ఖిలాడి'కి పోటీగా ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11నే విడుదల కానుండటం విశేషం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు విష్ణు విశాల్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ABOUT THE AUTHOR

...view details