- Polling Live: కొనసాగుతున్న ‘పుర’ పోలింగ్
రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
- AMIT SHAH: రాష్ట్ర భాజపా నేతలతో అమిత్ షా భేటీ..
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈరోజు 10 గంటలకు ఏపీ భాజపా నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చించనున్నట్టు సమాచారం.
- Attack on Actress : వాకింగ్‌కు వెళ్లిన.. హీరోయిన్ పై దాడి!
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో నటి చౌరాసియాపై దాడి జరిగింది. వాకింగ్ కు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడి (attack on heroine) చేసి ఫోన్ లాక్కెళ్లాడు.
- amaravathi padayathra start: 15వ రోజు.. అమరావతి పాదయాత్ర ప్రారంభం
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజు ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎం. నిడమానురు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ 14. కి.మీ సాగనుంది.
- రూ.600 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్‌లోని భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. ద్వారకాలోని మోర్బిలో 120 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని తెలిపారు.
- దేశంలో కొత్తగా 10,229 కరోనా కేసులు- 125 మరణాలు
దేశంలో కొవిడ్ కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 10,229 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్ కారణంగా మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Quick Commerce: అడిగిన వెంటనే ముంగిట ప్రత్యక్షం
కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను (Qucik commerce market) అందజేసే బిగ్‌బాస్కెట్, సూపర్ వంటి వాటిలోనూ వస్తువులను అందించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ లోటునూ పూడ్చేందుకు ఈ కామర్స్ కంపెనీలు.. ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వినియోగదారుడి చెంతకు వస్తువును చేర్చేందుకు క్యూ-కామర్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
- భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 340 ప్లస్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 340 పాయింట్లకు పైగా వృద్ధితో 60,963వద్ద ట్రేడవుతోంది.
- T20worldcup: కివీస్‌పై ఆసీస్ విజయం.. హైలైట్స్ చూసేయండి!
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో(T20 World Cup 2021) న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది ఆస్ట్రేలియా. ఈ పోరులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోను పోస్ట్ చేసింది ఐసీసీ. దాన్ని చూసేయండి..
- చీటింగ్ కేసుపై స్పందించిన నటి శిల్పాశెట్టి
తనపై నమోదైన చీటింగ్ కేసుపై స్పందించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa shetty updates).. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన వార్తలు @ 11AM