ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM - 11AM TOP NEWS

ప్రధాన వార్తలు @11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @11AM

By

Published : Oct 9, 2021, 11:01 AM IST

  • VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ మూడో రోజైన నేడు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేకువజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు భక్తలు గాయత్రీదేవిని దర్శించుకోవచ్చని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

  • CPI LEADER RAMAKRISHNA: 'జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయం'

పేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రభుత్వమిచ్చే డబ్బు నిర్మాణానికి సరిపోదని... అందువల్లే సర్కారే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • SIRPURKAR COMMISION: ఐసీయూలో ఎందుకు చేర్చారు.. వైద్యునికి ప్రశ్నల వర్షం

తెలంగాణలో సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కానిస్టేబుల్ అరవింద్‌కు చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్​ను ప్రశ్నించింది. అరవింద్​కు సాధారణ వైద్యమే అందించినప్పటికీ అత్యవసర చికిత్సా విభాగంలో ఎందుకు చేర్చారని కమిషన్ ప్రశ్నించింది.

17 ఏళ్ల బాలికపై ప్రియుడు సహా ఏడుగురు అత్యాచారం

ఓ 17 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు సహా అతని స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికపై మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. మరో ఘటనలో.. ఓ యువతిని ప్రేమించినవాడే గొంతుకోసి హత్య చేశాడు. యువతి తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

  • Azadi ka Amrut Mahotsav: జాతీయోద్యమానికి వేదికలైన దుర్గామాత ఉత్సవాలు

భారత్‌లో దుర్గా ఉత్సవాలు(durga puja celebration) బ్రిటిష్‌వారితో ఊపందుకున్నాయంటే ఈ రోజున ఎవ్వరం నమ్మలేం! భారత్‌లో ఈస్టిండియా కంపెనీ తొలి విజయానికి ప్రతీకగా జోరందుకున్న ఈ ఉత్సవాలు క్రమంగా.. జాతీయోద్యమానికి ఊతమయ్యేలా మారటం తెల్లవారూ ఊహించని పరిణామం(Azadi ka Amrut Mahotsav).

  • Corona Cases India: మరోమారు 20వేల దిగువకు కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. కొత్తగా 19,740 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 248 మంది మృతి చెందారు. తాజాగా 23,070 మంది కరోనాను జయించారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • మరోమారు ఎబోలా కలవరం- 5 నెలల తర్వాత కొత్త కేసు

ప్రాణాంతక ఎబోలా వైరస్(ebola virus)​ ఆఫ్రికా దేశాలను కలవరపెడుతోంది. 2020లో వందల మందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన 5 నెలల తర్వాత కొత్త కేసు నమోదైంది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.

  • వాట్సాప్ డీపీకి ఇకపై మరింత ప్రైవసీ!

వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల(whatsapp profile hide news)ను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్​.. మరోసారి సరికొత్త అప్​డేట్​తో ముందుకు రానుంది. ప్రొఫైల్ ఫొటో ప్రైవసీకి సంబధించిన ఫీచర్ ఇది.

  • Maa Elections 2021: 'మా'లో రాజకీయాలు.. ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు చిత్రసీమలో(Maa elections 2021) ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క విషయం 'మా' ఎన్నికలు(maa movie artist association). ఇండస్ట్రీతో మాత్రమే దీనికి కేవలం సంబంధం ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు కూడా 'మా' గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘం గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  • ప్రొ హాకీ​ లీగ్​లో తొలిసారి భారత మహిళల జట్టు

ఎఫ్​ఐహెచ్​ ప్రొ హాకీ లీగ్​(fih hockey pro league 2021)లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది భారత మహిళల జట్టు(india women hockey). కొవిడ్‌ కారణంగా తమ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఈ లీగ్‌ నుంచి వైదొలిగాయి. దీంతో భారత్‌, స్పెయిన్‌కు ఈ అవకాశం దక్కింది.

ABOUT THE AUTHOR

...view details