ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM

ప్రధాన వార్తలు @ 11AM

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11AM

By

Published : Oct 6, 2021, 11:01 AM IST

  • తెలంగాణలో లోయలో పడిన బస్సు.. ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ వద్ద పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 16 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

  • Crime News: బాలిక కిడ్నాప్‌ కేసులో ఆరేళ్లకు నిందితుడి ఆటకట్టు

ఆరేళ్ల క్రితం పాఠశాల ఉపాధ్యాయుడే వాళ్ల కూతురిని కిడ్నాప్ చేశాడు. పలు రాష్ట్రాలు తిప్పుతూనే ఆమెను ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు. ఇన్నాళ్ల తర్వాత ఆ తల్లిదండ్రుల కళ్లల్లో చెప్పలేని ఆనందం.. కిడ్నాపైన ఆరేళ్ల తర్వాత కన్నబిడ్డ కళ్లముందు కనబడటంతో ఒక్కసారిగా తెలియని అనుభూతితో ఆ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

  • COUPLE DEATH: అనారోగ్యంతో భర్త.. విషయం తెలిసి భార్య మృతి

కట్టుకున్న వాడికి కలకాలం తోడుంటానని చెప్పింది. ఆయన ఏం చేసినా.. ఎక్కడికెళ్లినా వెంటే ఉంటూ అండగా నిలిచింది. చివరకు ఆయన చావులో కూడా తాను తోడుంటానని ఆయన వెంటే వెళ్లిపోయింది. అనారోగ్యంతో భర్త మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న ఆమె... గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చూస్తుండగానే ప్రాణాలు విడిచింది.

  • Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి (Silver price today) ధర కూడా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Corona Cases: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా​ కేసులు

దేశంలో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 18,833 మందికి వైరస్​ సోకింది. మరో 203 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • రాహుల్​ లఖింపుర్​ పర్యటనకు అనుమతి నిరాకరణ

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​లో కాంగ్రెస్​ అగ్ర​నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi News) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించేందుకు ఆ రాష్ట్ర​ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖ్​నవూలో 144వ సెక్షన్​ అమలవుతున్నందున ఈ పర్యటనకు అనుమతినివ్వట్లేదని స్పష్టం చేసింది.

  • సామాన్యుడిపై భారం- రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర

గ్యాస్ ధరను మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. 14.2కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్​ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.900కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

  • Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు- ఐటీ షేర్ల దూకుడు

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 130 పాయింట్లకుపైగా లాభంతో 59,883 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 50 పాయింట్లకుపైగా పెరిగి 17,873 వద్ద కొనసాగుతోంది. ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • బాలయ్య భామ ఎంత ముద్దుగున్నదో!

'పైసా వసూల్', 'రాగల 24 గంటల్లో' చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. సోషల్ ​మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

  • 'టీ20 ప్రపంచకప్​లో అది భారత్​కు పెద్ద దెబ్బ'

ఐపీఎల్‌లో (ipl 2021 news) ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ (hardik in ipl 2021) చేయకపోవడంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించాడు.

ABOUT THE AUTHOR

...view details