- 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేశారు. జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతున్నందును అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Steel plant protest: కేంద్ర అఫిడవిట్‌ను వ్యతిరేకిస్తూ.. స్టీల్ ప్లాంట్ ఎదుట నిరసన
హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేయి దాటకుండా... కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుటుంబానికో ఇంటి స్థలం..!
పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) లేఅవుట్లలో కుటుంబానికో స్థలం కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వార్షికాదాయం రూ.18 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల ఆధ్వర్యంలో త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక!
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. పగిలినది వైకాపా నేత కారు అద్దం అయితే.. దేవినేని ఉమా కారు అని ప్రచారం చేస్తున్నారు అని మంత్రి ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగస్టు 1 నుంచే సర్వీసు..
ఆగస్టు ఒకటో తేదీ నుంచి విజయవాడ - విశాఖపట్నం మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 43,509 కరోనా కేసులు