ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @11AM - trending news

.

ప్రధాన వార్తలు @11AM
ప్రధాన వార్తలు @11AM

By

Published : May 5, 2021, 11:00 AM IST

  • కాసేపట్లో తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ.. కరోనా తీవ్రతపై చర్చ

కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ జరగనుంది. నేతలు ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నేటి నుంచి మధ్యాహ్నం 12 వరకే ఆర్టీసీ సర్వీసులు

రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజా రవాణాపై ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఏపీలో వేకువ జామునే వైన్స్​...

కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో.. ఏపీలో నేటి నుంచి ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తెలంగాణలో కొత్తగా 6,361 కేసులు... 51 మరణాలు

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కొత్తగా 6,361 కొవిడ్ కేసులు నమోదు కాగా... 51 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 వేలకు పైగా క్రియాశీల కేసులున్నాయి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశంలో కొత్తగా 3.82 లక్షల మందికి కరోనా

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 3.82 లక్షల‬ మంది వైరస్​ బారినపడ్డారు. మరో 3,780 మంది మృతిచెందారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బంగాల్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న నిర్ణయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తప్పుపట్టారు. మమతా బెనర్జీని ప్రజలు తిరస్కరించినప్పటికీ పదవి చేపడితే నైతిక విలువలపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'బంగాల్ హింసాత్మక ఘటనల్లో బాలలు'

బంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన హింసపై బాలల హక్కుల రక్షణ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనడానికి చాలా మంది పిల్లలను నియమించినట్లు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. వీటిపై నివేదిక ఇవ్వాలని బంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గుండె జబ్బులను వేగంగా గుర్తించే విధానం

బ్రిటన్ ఆరోగ్య సేవా (ఎన్​హెచ్​ఎస్​) విభాగం కీలక ప్రకటన చేసింది. గుండె జబ్బులను వేగంగా గుర్తించడానికి ఒక విప్లవాత్మక పరిజ్ఞానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం ద్వారా రుగ్మతలను వేగంగా గుర్తించి, చికిత్స చేయడం సులభం అవుతుందని తెలిపింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మాజీ క్రికెటర్​ కిడ్నాప్.. విడుదల!

ఆస్ట్రేలియా మాజీ బౌలర్​ స్టువర్ట్ మ్యాక్​​గిల్​ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారు. అయితే ప్రస్తుతం అతడు కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైనట్లు ఆ దేశ మీడియా ఓ నివేదికలో వెల్లడించింది. కిడ్నాప్​కు పాల్పడ్డ వారిని సిడ్నీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఫ్యామిలీ మ్యాన్​ 2' రిలీజ్​కు ముహూర్తం ఖరారు?

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్​సిరీస్​​ ఫిబ్రవరిలో విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఓటీటీ రిలీజ్​ను ఆపేసిన నిర్మాణసంస్థ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details