ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - LATEST NEWS UPDATES IN AP

.

11 am top news
ప్రధాన వార్తలు @11AM

By

Published : Dec 17, 2021, 11:00 AM IST

  • తిరుపతిలో 'సమరావతి సభ'..తరలివస్తున్న రైతులు
    అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంతం వెలుపల తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు రైతులు సిద్ధమయ్యారు. తిరుపతి వేదికగా నేడు జరగనున్న 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పుష్ప'లో బన్నీ ఎక్కడా తగ్గేదేలే..!
    అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'కు భారీ స్పందన లభిస్తోంది. బన్నీ అదిరిపోయే ప్రదర్శన చేశాడట. ఇక క్లైమాక్స్​ మరో స్థాయిలో ఉందంటూ ట్విట్టర్​లో సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'పుష్ప' ఎలా ఉందో మీరూ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై కొత్త మెలిక!
    రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై ప్రభుత్వం కొత్త మెలిక పెట్టనుంది. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, సేల్‌ కం జీపీఏ రిజిస్ట్రేషన్‌ ఛార్జీల నిబంధనలను మారుస్తూ అధికారులు తాజాగా ఉత్తర్వులిచ్చారు. కొనుగోలుదారులపై పరోక్ష బాదుడు మోపనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బైకును ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి
    కృష్ణా జిల్లా నక్కలంపేట బైపాస్ వద్ద సర్వీస్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికిక్కడే మృతిచెందగా..మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మద్యం అనుకొని తాగితే.. ప్రాణాలు పోయాయి
    ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం అనుకొని ద్రవాన్ని తాగిన ఘటనలో దంపతులు మృత్యవాత పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ భయంతో.. తల్లిదండ్రులను నరికి చంపిన బాలుడు!
    నిద్రిస్తున్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు
    దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 391 మంది వైరస్​కు బలయ్యారు. గురువారం 70,46,805 మందికి టీకాలు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • షాపింగ్​ మాల్​లో అగ్ని ప్రమాదం.. 27మంది మృతి!
    జపాన్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 8 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.50వేలు దాటిన బంగారం ధర
    బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు జరిగాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 వేలు దాటింది. బంగారం బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.630 ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా స్టెయిన్‌
    సన్​రైజర్స్​ హైదరాబాద్ బౌలింగ్ కోచ్​ బాధ్యతలు స్వీకరించనున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్. టామ్‌ మూడీ మళ్లీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు లఖ్​నవూ జట్టు ప్రధాన కోచ్​ రేసులో జింజాబ్వే మాజీ కెప్టెన్‌ ఆండీ ఫ్లవర్‌ ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details