ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాపులకు రిజర్వేషన్లపై నిర్ణయం ఒక్కరే తీసుకోలేరు : మంత్రి కన్నబాబు - అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు

అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో అమలు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

Agriculture Minister Kursala Kannababu
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

By

Published : Jul 15, 2021, 1:22 PM IST

Updated : Jul 16, 2021, 8:54 AM IST

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

‘విద్య, ఉద్యోగ నియామకాల్లో కాపులకు రిజర్వేషన్ల అంశం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు. మీరడిగారని ఇప్పటికిప్పుడు ఇక్కడ చెప్పే విషయమూ కాదు. దానిపై చర్చ జరగాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్లపై మీ ప్రభుత్వ వైఖరేంటి, కాపుల్ని బీసీల్లో చేరుస్తూ గతంలో తెదేపా ప్రభుత్వం కేంద్రానికి పంపిన బిల్లును ఉపసంహరించుకుంటారా? అని విజయవాడలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

కాపులకు రిజర్వేషన్లపై రాజ్యాంగ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామే తప్ప, పైపైన హామీలిచ్చి చేతులు దులిపేసుకోబోమని అధికారంలోకి రాకముందు నుంచీ జగన్‌ చెబుతున్నారన్నారు. దానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు, మరో 5 శాతాన్ని మిగతా కులాలకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందుకే ఆ వర్గీకరణ జోలికి వెళ్లకుండా మొత్తం అగ్రవర్ణాల్లోని పేదలందరికీ వర్తించేలా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అగ్రవర్ణాల్లోని పేదలందరికీ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండేళ్ల కిందట జీవో ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి వర్గీకరణ చేయలేదని కన్నబాబు గుర్తుచేశారు.

అగ్రవర్ణ పేదలు నష్టపోకూడదనే..

‘తెదేపా ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కేటాయించింది. ఆ కోటాను ఇలా కులాలవారీగా వర్గీకరించవచ్చా అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. చాలా మంది కోర్టులకెళ్లడంతో ఆ వ్యవహారం అక్కడే నిలిచిపోయింది. అంతకు ముందు తెదేపా ప్రభుత్వం కాపుల్ని బీసీల్లో ఎఫ్‌ కేటగిరీగా చేర్చేందుకు బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించింది. తర్వాత ఈడబ్ల్యూఎస్‌లో ఐదు శాతం కాపులకు ఇస్తూ చట్టం చేసింది. ఆ రెండింటిలో దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. చంద్రబాబు దాన్ని పక్కన పెట్టేశారు. కాపులు ఓసీలా, బీసీలా తెలియని అయోమయంలోకి నెట్టేయడమే కాదు వారిని ఎలాంటి రిజర్వేషన్‌ ఫలాలు పొందకుండా చేశారు’- మంత్రి కన్నబాబు

ఇంకా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాల్లో అగ్రవర్ణ పేదలు నష్టపోతారన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. కాపులు 30 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని, ఎప్పుడూ ఇతర కులాల నుంచి లాక్కోవాలని చూడలేదని కన్నబాబు చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లో సింహభాగం కాపు కులాలకు దక్కే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:

smart card: రవాణా శాఖలో స్మార్ట్‌ కార్డుల ముద్రణ మళ్లీ ప్రారంభం

Last Updated : Jul 16, 2021, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details