ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - top news today

...

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : May 4, 2021, 12:52 PM IST

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొవిడ్ ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూకు ఆమోదంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారు: దేవినేని ఉమ

ప్రభుత్వంపై తెదేపా ముఖ్యనేత దేవినేని ఉమ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్‌ అందించాల్సిందిపోయి కక్షసాధింపులా..? అని ప్రశ్నించారు. విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లను ఖరారు చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషనర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆమోదం కోసం వారి పేర్లను గవర్నర్​ వద్దకు పంపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సబ్బంహరి పార్థివదేహానికి కుటుంబసభ్యులు నివాళి

మాజీ ఎంపీ సబ్బంహరి పార్థివదేహానికి సీతమ్మధారలోని ఆయన నివాసంలో కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కేఆర్ఎం కాలనీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బిహార్​లో మే 15 వరకు లాక్​డౌన్

దేశంలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్ననేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు లాక్​డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లాక్​డౌన్​తోనే వైరస్​ వ్యాప్తిని అరికట్టగలం: రాహుల్

దేశంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్​డౌన్​ తప్పనిసరిగా విధించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. పేదలకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన పైనుంచి రైలు కిందపడి 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికా ఇమ్మిగ్రేషన్​ సంస్థపై హెచ్​-1బీ దావా ఉపసంహరణ

అమెరికా ఇమ్మిగ్రేషన్​ సంస్థపై వేసిన దావాను వెనక్కి తీసుకుంది అగ్రరాజ్యానికి చెందిన ఏడు వ్యాపార సంస్థల బృందం. విదేశీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయాలను మార్చుకునేందుకు సంస్థ అంగీకరించిన నేపథ్యంలో దావాను వెనక్కి తీసుకున్నాయి ఆయా సంస్థలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​-14లో రీఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్​​​!

వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఐపీఎల్​కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​.. తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నారని.. త్వరలోనే అశ్విన్​ను ఐపీఎల్​లో చూస్తామని పలువురు క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెజీనా, నివేదా కొత్త చిత్రం 'శాకినీ-ఢాకినీ'!

యువ కథానాయికలు రెజీనా కసెండ్రా, నివేదా థామస్​ ప్రధానపాత్రల్లో ఓ యాక్షన్​ చిత్రం రూపొందుతోంది. కొరియన్​ సినిమా 'మిడ్​ నైట్​ రన్నర్స్​' ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'శాకినీ-ఢాకినీ' అనే టైటిల్​ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details