ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 1PM - trending news

.

TOP NEWS
TOP NEWS

By

Published : Jul 13, 2020, 1:00 PM IST

  • ఈసీ, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు

ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలి'

కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్​ కిట్లు వినియోగించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి... రోగిని ఐసోలెట్ చేయాలని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమర్శలు భరించలేకే...

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు కాపు సోదరులకు లేఖ రాశారు. తనపై వస్తోన్న లేనిపోని ఆరోపణలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమ్మ పలికింది

తెలంగాణలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అది నిజమేనా..?

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. కరోనా విషయంలో మంచి స్థితిలోనే ఉన్నామంటూ కేంద్రం చెప్పుకోవడాన్ని తప్పబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సింధియా వర్గానికి కీలక శాఖలు

మధ్యప్రదేశ్​లో నూతనంగా ఏర్పడిన భాజపా ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ లాభాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా పెరిగి 36,859 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభంతో 10,874 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ధావన్​ వంట

టీమ్​ఇండియా ఓపెనర్​ ధావన్​.. తన తనయుడు జొరావర్​ సూపర్​హీరో దుస్తులతో వంట చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. సూపర్​హీరోలు కూడా వంట చేయగలరు అనే కామెంట్​ను జోడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కైఫ్​ జీవితాన్నే మార్చేసింది

సరిగ్గా 18 ఏళ్ల క్రితం జరిగిన నాట్​వెస్ట్ ఫైనల్​ను గుర్తు చేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ మ్యాచ్ తన జీవితాన్నే మార్చేసిందని, ఎప్పటికీ​ ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పాడు. అందుకే 2018లో అదే తేదీన రిటైర్మెంట్​ ప్రకటించినట్లు వెల్లడించాడు. ​పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మంచి తరుణం

కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న ప్రస్తుత కాలం, పెళ్లి చేసుకునేందుకు సరైన సమయమని చెప్పాడు బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఎక్కువ ఖర్చు లేకుండా తంతు ముగిసిపోతుందని అన్నాడు. ట్విట్టర్​లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఇలా సమధానమిచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details