ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2019, 8:04 PM IST

Updated : Jun 20, 2019, 9:15 PM IST

ETV Bharat / briefs

యోగాతో 'తెలుగు బుక్​ ఆఫ్​​ రికార్డు'లో చోటు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆమలోద్భవి ఉన్నత పాఠశాలలో 'సహస్ర విద్యార్థుల సూర్య నమస్కారములు కార్యక్రమం' నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఏకాగ్రతతో సూర్యనమస్కారాలు ఆచరించి తెలుగు బుక్​ ఆఫ్​​ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

యోగా చేసి 'తెలుగు బుక్​ ఆఫ్​​ రికార్డు'లో చోటు దక్కించుకున్నారు

యోగా చేసి 'తెలుగు బుక్​ ఆఫ్​​ రికార్డు'లో చోటు దక్కించుకున్నారు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆమలోద్భవి ఉన్నత పాఠశాలలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించడం కోసం వేయి మంది విద్యార్థులతో 'సహస్ర విద్యార్థుల సూర్య నమస్కారములు' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ జయరావు పొలిమేర హాజరైనారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగ గురువు రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు. ఒకేసారి సహస్ర విద్యార్థుల సూర్యనమస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఏకాగ్రతతో సూర్యనమస్కారాలు ఆచరించారు. గంటకుపైగా ఏకధాటిగా సూర్యనమస్కారాలు, యోగాసనాలు విద్యార్థులు వేసి తెలుగు బుక్ ఆఫ్​ రికార్డు సాధించారు. తెలుగు బుక్ ఆఫ్​ రికార్డు అబ్జర్వర్ సాయి విచ్చేసి ప్రశంసా పత్రాన్ని నిర్వహకులకు అందజేశారు. విద్యార్థులను అభినందించారు. ప్రతి రోజు అరగంట సేపు యోగాసనాలు వేయటం వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.

Last Updated : Jun 20, 2019, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details