రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఓటర్ల తుది జాబితా ఇవాళ విడుదల కానుంది.జనవరి11న విడుదలైన జాబితా అనంతరం నమోదు,తొలగింపు చేసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది.అన్నిదరఖాస్తుల తనిఖీలు పూర్తి చేసుకుని నేడు మధ్యాహ్నం3గంటలకు తుది అనుబంధ జాబితా విడుదల చేయనుంది.కొత్తగా25లక్షల మంది ఓటర్లు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
తొలగించినవి లక్షా42వేలు
ఓట్ల తొలగింపునకు సుమారు12లక్షల50వేల దరఖాస్తులు రాగా...సునిశిత పరిశీలన అనంతరం లక్షా42వేల ఓట్లు తొలగించామని ఎన్నికల అధికారి వెల్లడించారు.ప్రస్తుత ఓటర్ల సంఖ్య3కోట్ల93లక్షలకు చేరిందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.మార్చి25నుంచి ఏప్రిల్ ఐదో తేదీలోగా కొత్త ఓటరు కార్డులు పంపిణీ చేయనున్నారు.