విశాఖ నగరంలో ఈ నెల 28న వీటీమ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో డాన్స్-ఏ-థాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. వినూత్న రీతిలో సంగీతం, నృత్యం రెండూ కలిపి రన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ వీరు మామ తెలిపారు.
భారతదేశంలో తొలిసారిగా నృత్యాలతో కూడిన పరుగు ఇదేనని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, ఆనందం కోసం నవ్వుతూ నృత్యం చేస్తూ పరిగెట్టడం ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమన్నారు. సంగీతంతో పాటు నృత్యం కలిగిన పరుగు, ప్రత్యేక ఆకర్షణగా ఫ్లాష్ మాబ్, జుంబా, పంజాబీ డోల్, తీన్మార్, డాన్స్ సెల్ఫీస్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.