ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​కు ఓబీసీల అండ" - mahan dal

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతివ్వనున్నట్లు ప్రియాంక గాంధీ సమక్షంలో యూపీ ఓబీసీ పార్టీ మహాన్​ దళ్ ప్రకటించింది.

ఉత్తర్​ప్రదేశ్​​లో కాంగ్రెస్​కు ఓబీసీల అండ

By

Published : Feb 14, 2019, 7:28 AM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఓబీసీ పార్టీ మహాన్​ దళ్​. రాష్ట్ర కాంగ్రెస్​ తూర్పు, పశ్చిమ కార్యదర్శులు ప్రియాంకగాంధీ, సింధియాల సమక్షంలో తమ నిర్ణయం వెలువరించింది.

"మహాన్​ దళ్​ అధినేత కేశవ్​దేవ్ మౌర్యకు స్వాగతం. ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కొందాం. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని రాహుల్ గాంధీ ఆకాంక్ష."

-ప్రియాంక గాంధీ

''కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎస్సీలు, బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్​'' అని కితాబిచ్చారు కేశవ్​దేవ్​ మౌర్య.

2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతిచ్చిన మహాన్​ దళ్ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసింది. పశ్చిమ యూపీలోని ఓబీసీకి చెందిన శాక్య, మౌర్య, కుశ్వాహా కులాల్లో మహాన్​ దళ్​కు మంచి పట్టుంది.

ABOUT THE AUTHOR

...view details