ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'సమయం లేదు.. యుద్ధానికి సిద్ధం కండి' - ap

ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తానని అన్నారు.

యుద్ధానికి సిద్ధంకండి.. నేతలకు సీఎం పిలుపు

By

Published : Mar 12, 2019, 10:07 AM IST

ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తానని అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటానికి లేదని తెలిపారు.

ఇదేం రాజకీయం...

వేలంపాటలా వైకాపాలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. చింతలపూడిలో వైకాపా వాళ్లు అభ్యర్థులను మారుస్తూ వచ్చారన్నారు. రూ.3 కోట్లు ఇస్తానంటే ఒకరికి అంతకంటే ఎక్కువ ఇస్తానంటే మరొకరికి అంటున్నారన్నారు. పనిచేసిన వారితోపాటు సామాజిక న్యాయమూ తెదేపా అభ్యర్థుల ఎంపికలో ఉందని సీఎం స్పష్టం చేశారు.

టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని తాను చెబితే నేతలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని అన్నారు. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తానని హామీ ఇచ్చారు. కుట్రలపై జాగ్రత్తగా ఉంటూనే తాము ఎన్నికలు చేసుకోవాలని పార్టీ నేతలతో సీఎం సూచించారు. విభజన నాటి పరిస్థితులు నేటి పరిస్థితులను అంచనా వేసి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. ఈ మూడ్రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేదన్నారు. గెలుపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details