ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులో ఉత్సవాలు జరుపుకున్నారు. తెలుగు సాంస్కృతిక సంఘాలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. చెన్నైలోని స్థానిక పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రముఖ నృత్య కళాకారుడు మాధవపెద్ది మూర్తి శిష్య బృందం.. కూచిపూడి నృత్యంలో త్యాగయ్య, అన్నమయ్య కీర్తనలకు చేసిన నృత్యం అలరించింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఈ వేడుకలు జరిపామని నిర్వాహకులు తెలిపారు.
తమిళనాట... 'ఉగాది' సాంస్కృతిక కార్యక్రమాలు - సాంస్కృతిక
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడులో ఉత్సవాలు జరుపుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఈ వేడుకలు జరిపామని నిర్వాహకులు తెలిపారు.
తమిళనాట 'ఉగాది' సాంస్కృతిక కార్యక్రమాలు