విజయనగరం జిల్లాకు కురుపాం శాసనసభ్యురాలు పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమశాఖను సీఎం జగన్ కేటాయించారు. ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన ఆమెను... ఎమ్మెల్యేగా రెండో పర్యాయంలో మంత్రి పదవి వరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పుష్పశ్రీవాణి... గిరిజనులు అన్ని విధాలా వెనుకబడ్డారని, వారి అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తుచేశారు. ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వడం వలన... గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసే అవకాశం లభించిందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానంటున్న పుష్పశ్రీవాణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
గిరిజనులు హక్కుల రక్షణే నా బాధ్యత: మంత్రి శ్రీవాణి
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించడం సంతోషంగా ఉందని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి నిరంతర పనిచేస్తానన్న ఆమె... సీఎం జగన్ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్నారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి