ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా

ప్రొద్దుటూరులో ఈ తెల్లవారుజామున విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటల ధాటికి ట్రాన్స్​ఫార్మర్ పేలిపోయింది.  ఈ ప్రమాదంతో స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

By

Published : Jun 12, 2019, 8:30 AM IST

Updated : Jun 12, 2019, 9:08 AM IST

పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా

పేలిన ట్రాన్స్​ఫార్మర్...నిలిచిన విద్యుత్ సరఫరా
కడప జిల్లా ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించి...ట్రాన్స్​ఫార్మర్ పేలింది. ఈ పేలుడికి దగ్గరలో ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
Last Updated : Jun 12, 2019, 9:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details