ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రధానవార్తలు @7PM - ap top ten news

..

TOP NEWS
ప్రధానవార్తలు @7PM

By

Published : May 14, 2021, 7:01 PM IST

  • ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు
    నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నెల్లూరు, రాయలసీమ ఆస్పత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు: కృష్ణబాబు
    రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని... ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు వెల్లడించారు. కేంద్రానికి సీఎం లేఖ, తదుపరి చర్యలతో ఆక్సిజన్‌ సరఫరా వేగవంతమైందని వివరించారు. రాష్ట్రానికి మరో 3 ఐఎస్‌వో ట్యాంకులను కేంద్రం ఇస్తోందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారు?: టీఎస్ హైకోర్టు
    రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత ఇష్యూ కాంట్రవర్సీగా మారుతోంది. ఈ విషయంపై టీఎస్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంబులెన్సులను ఏ రాష్ట్రం ఆపలేదని... ఆ హక్కు ఎవరకీ లేదని స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా..? అని గట్టిగా నిలదీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 8 వేల మంది కరోనా బాధితులు మిస్సింగ్!
    బెంగళూరులో 8 వేల మందికి పైగా కరోనా బాధితుల జాడ తెలియటం లేదని బెంగళూరు మహానగర పాలక సంస్థ, రాష్ట్ర వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది బాధితులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ అధికారుల ద్వారా బాధితులను గుర్తిస్తున్నామన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • '3 వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు రవాణా'
    స్పైస్​జెట్​ సరకు రవాణా విభాగం స్పైస్​ఎక్స్​ప్రెస్.. మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​​, కొవిడ్ ఔషధాలను సరఫరా చేసినట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేరళకు 'తౌక్టే' ముప్పు- రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​
    'తౌక్టే' తుపాను నేపథ్యంలో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవచ్చన్న హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించి.. సహాయ శిబిరాలను ప్రారంభించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అసలే కరోనా.. ఆపై బాంబుల మోత
    అటు కరోనా సంక్షోభం.. ఇటు ఇజ్రాయెల్​ దాడులతో గాజా ప్రాంతం గజగజ వణికిపోతోంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థ.. తాజా పరిణామాలతో అత్యంత దారుణ స్థితిని ఎదుర్కొంటోంది. రాకెట్​ దాడుల్లో గాయపడి ఎందరో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ అథ్లెట్లకు రెండోసారి పరీక్షల్లో కరోనా నెగిటివ్
    రేస్ వాకర్ ఇర్ఫాన్ సహా మరో నలుగురు అథ్లెట్లకు రెండోసారి చేసిన కొవిడ్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బెంగళూరులోని సాయ్ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సల్మాన్​ఖాన్​కు కొవిడ్ వ్యాక్సిన్​ రెండో డోసు
    అగ్రకథానాయకుడు సల్మాన్​ఖాన్.. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఈయన నటించిన 'రాధే', రంజాన్​ కానుకగా విడుదలైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details