ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అమెరికాలో మనోళ్లకు ఊరట!

అమెరికా అధికారుల అదుపులో ఉన్న తెలుగు విద్యార్థుల్లో 8 మందికి ఊరట లభించింది. స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లేందుకు మిచెగావ్ న్యాయస్థానం వారికి అనుమతినిచ్చింది.

By

Published : Feb 13, 2019, 3:41 PM IST

అమెరికాలో మనోళ్లకు ఊరట

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో అమెరికా అధికారుల అదుపులో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎనిమిది మందికి ఊరట లభించింది.స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లేందుకు మిచెగావ్ న్యాయస్థానం అనుమతిచ్చింది.ఈ నెల26లోగా అమెరికా విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆ 8 మందిని భారత్ కు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా తెలుగు అసోసియేషన్..ఆటా తెలిపింది. బాధిత విద్యార్థులకు మద్దతుగా నిలవాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి ఎలిసా స్లాటికిన్ ను ఆటా ప్రతినిధులు కోరారు.విద్యార్థులకు నేరం చేసే ఉద్దేశం లేదని..వారు పొరపాటున ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరినట్లు తెలుస్తోందని ఎలిసా చెప్పారు.వారు స్వదేశానికి వెళ్లేలా సహకరిస్తామన్నారు.

అమెరికాలో మనోళ్లకు ఊరట

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో చిక్కుకున్న120మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లోని డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్నారు.కేలహోన్,మన్రో కౌంటీ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న20మంది విద్యార్థులకు సంబంధించిన విచారణ పూర్తయింది.వారిలో ఇద్దరు భారతీయులు,ఒక పాలస్తీనా విద్యార్థికి స్వచ్చందంగా వెళ్లిపోవడానికి ఇప్పటికే అనుమతి లభించింది. మిగతా17మందిలో8మంది తెలుగు విద్యార్థులు సహా15మందికి ఇవాళ కోర్టు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఒక విద్యార్థిని దేశం నుంచి బహిష్కరిస్తూ.. త్వరగాపంపించాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.మరో విద్యార్థి అమెరికాకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నందున..బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details