ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కన్నపేగుపై ఇటుక దెబ్బ

ఆ కన్న తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. కనిపెంచిన తల్లే.. ఇద్దరు చిన్నారులపై ఇటుకతో చావబాదింది. దెబ్బలకు పెద్దకొడుకు చనిపోగా.. చిన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తరువాత ఆ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తల్లే చంపేసింది

By

Published : Mar 4, 2019, 12:31 PM IST

Updated : Mar 4, 2019, 1:59 PM IST

తల్లే చంపేసింది

ఇటుకతో పిల్లల్ని చంపిన తల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలపై కోపమో, ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ కలహాలో.. కారణం ఏదేతైనేం... రమాదేవి అనే మహిళ తన ఇద్దరు కుమారులను ఇటుకలతో చితకబాదింది.తీవ్రగాయాలైన 11 ఏళ్ల అజయ్​ అక్కడికక్కడే మృతి చెందగా... మరో కుమారుడు ఆర్యన్​ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనానంతరం ఆ తల్లి ఆత్మహత్యయత్నానికిపాల్పడింది. తీవ్రగాయాలైన ఆరేళ్ల ఆర్యన్​ను చికిత్స కోసం కరీంనగర్​కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితురాలిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండిఃచిన్నారిని చిదిమేసింది

Last Updated : Mar 4, 2019, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details