సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే వర్మపై దాడి ఘటనకు సంబంధించి... ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కొత్తపల్లి పోలీసు స్టేషన్కు చేరుకుని ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, కొబ్బరి బొండాలు విసిరారు. దాడిలో ఒక కానిస్టేబుల్, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కొత్తపల్లి పీఎస్ ఎదుట ఉప్పాడ గ్రామస్థుల ధర్నా.. లాఠీఛార్జ్
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఉప్పాడ గ్రామానికి చెందిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోన్న గ్రామస్థులకు వైకాపా నేతలు మద్దతు తెలిపారు.
కొత్తపల్లి పోలీసు స్టేషన్ ముందు ఉప్పాడ గ్రామస్థుల ధర్నా