ఈసీ ఆదేశాల కాపీని విడుదల చేసిన తెదేపా ఈసీకి వైకాపా ఇచ్చిన ఫిర్యాదు కాపీని,... బదిలీలకు సంబంధించిన ఈసీ ఆదేశాల కాపీని తెదేపా మీడియాకు విడుదల చేసింది.ఈ నెల 25వ తేదీన విజయసాయి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నిన్నటి నుంచిఈసీ చర్యలు ప్రారంభించింది.డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను బదిలీ చేయాలని వైసీపీ సూచించిందని,... శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీలనూ కూడా బదిలీ చేయాలని వైకాపా కోరిందన్నారు.ప్రకాశం, చిత్తూరు ఎస్పీలపై చర్యలకు వైసీపీ డిమాండ్ చేసిందని,అదనపు సీఈఓ సుజాత శర్మను బదిలీ చేయాలని ఈసీకి వైసీపీ సూచించిందన్నారు.రిటైర్డ్ ఐపీఎస్ యోగానంద్, లా అండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసిందని లేఖలో పేర్కొన్నారు.వైసీపీ చెప్పినట్టే ఈసీ చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని తెదేపా నేతలు మండిపడ్డారు.
ఇవి చదవండి