ప్రసంగాల్లో పదేపదే పారదర్శకత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. బందరు పోర్టు విషయంలో రహస్య జీవో ఎందుకు విడుదల చేశారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన... జూన్ 8న విడుదల చేసిన రహస్య జీవో మర్మం ఏంటని ప్రశ్నించారు. తిరిగి ఆ జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బందరు పోర్టువద్ద 8 వేల ఎకరాల భూములను తెలంగాణకు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రహస్య జీవో గుట్టు విప్పాలి: మద్దాలి - బందురు పోర్టు
కృష్ణా జిల్లా బందరు పోర్టు భూములకు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా నేత మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు వైకాపా నేతలు భయపడుతున్నారని ఆరోపించారు.
రహస్య జీవో గుట్టు విప్పండి : తెదేపా నేత మద్దాలి గిరిధర్