ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అవినీతి, హత్యా రాజకీయాలకు జగన్‌ అంబాసిడర్‌! - వివేకానందరెడ్డి

'అవినీతి, హత్యా రాజకీయాలకు జగన్‌.. బ్రాండ్‌ అంబాసిడర్‌. కుట్రలు, కుతంత్రాలు చేయటం ఆయనకు అలవాటే... ఎన్నికల అఫిడవిట్​లో 25 పేజీలు ఆయన నేర చరిత్ర గురించే ఉంది'. - తెదేపా నేత రాజేంద్రప్రసాద్

మీడియా సమావేశంలో తెదేపా నేత రాజేంద్రప్రసాద్

By

Published : Mar 23, 2019, 2:26 PM IST

మీడియా సమావేశంలో తెదేపా నేత రాజేంద్రప్రసాద్
అవినీతి, హత్యా రాజకీయాలకు వైకాపా అధ్యక్షుడు జగన్‌.. బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెదేపా నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. హత్యలు, దహనకాండలకు తెదేపా కుట్రలు పన్నుతున్నట్లు జగన్ ప్రచారం చేయటం.. హాస్యాస్పదమన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు వైకాపా నేతలకు అలవాటని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. వివేకానందరెడ్డి హత్యలో తెదేపా నేతలపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఎవరు, ఎక్కడ చనిపోయినా తెదేపాపై ఆరోపణలు చేయడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. జగన్‌ అఫిడవిట్​లో 25 పేజీలు... ఆయన నేరాల గురించే ఉన్నాయని చెప్పారు. విద్యార్థులను రోడ్డుపైకి తీసుకొచ్చిన మోహన్‌బాబు.. గల్లీ రాజకీయాలు మానుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details