తిరిగితిరిగి వైకాపా గూటికే... - hyd
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ... టిక్కెట్ ఆశావహులు జెండాలు మారుస్తున్నారు. ప్రజాభిమాన నేతలకే సీట్లు దక్కుతున్న నేపథ్యంలో నాయకులు అభ్యర్థిత్వం కోసం పార్టీలు మారక తప్పట్లేదు. ఇలాంటి పరిణామలతో రఘురామ కృష్ణంరాజు వైకాపా కండువా కప్పుకొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తున్న తెదేపా నేత రఘరామ కృష్ణంరాజు వైకాపాలో చేరారు. లోటస్ పాండ్లో వైకాపా అధినేత జగన్తో ఆయన భేటీ అయ్యారు.గత కొంత కాలంగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న ఈయన భాజపాను వీడి తెదేపాలోకి వచ్చారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇటీవల సీఎం చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎంపీ అభ్యర్థి విషయమై ఎలాంటి సమీక్ష చేయలేదని కృష్ణంరాజు అసంతృప్తికి గురయ్యారు. వైకాపా నేత విజయసాయిరెడ్డితో చర్చల అనంతరం...ఆయన జగన్ గూటికి చేరారు.