రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 45 డిగ్రీల పైస్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. ఎండలు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. పగటి పూట ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి పట్టణంలో పలు చోట్ల.. స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి.
భానుడి భగభగలు...ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు
భానుడి ప్రతాపానికి చీరాల వాసులు అల్లాడుతున్నారు. ఉక్కపోత, ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన ప్రజలు పగటి పూట బయటకు రావటానికి భయపడుతున్నారు. వడగాల్పులు వీచే అవకాశం ఉందని...ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చీరాలలో భానుడి భగభగలు