తెలంగాణ పోలీసు ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన స్టీఫెన్ రవీంద్ర దాదాపు గంటసేపు జగన్‌తో సమావేశమయ్యారు. రవీంద్రతోపాటు రాష్ట్ర విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ జగన్‌తో భేటీలో పాల్గొన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులు కానున్నారన్న ఊహాగానాల మధ్య...స్టీఫెన్ రవీంద్ర సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రవీంద్రను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలంటే ముందుగా ఏపీ నుంచి అధికారిక సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లాలి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం నుంచి కేడర్ మార్పుపై అధికారిక ఉత్తర్వులు జారీ అవ్వాలి. ఈ అంశాలపైనే స్టీఫెన్ రవీంద్ర జగన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రమాణస్వీకారం తర్వాత రవీంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
జగన్‌తో స్టీఫెన్ భేటీ... గంటసేపు ఆసక్తికర చర్చ - స్టీఫెన్ రవీంద్ర
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య స్టీఫెన్ రవీంద్ర, జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన తెలంగాణ ఐజీ... కేడర్ మార్పు, ఏపీకి బదలాయింపు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
జగన్‌తో స్టీఫెన్ రవీంద్ర భేటీ.
ఇవీ చూడండి : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా.. తెలంగాణ ఐపీఎస్