ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చరిత్రలో మోదీలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: సోమిరెడ్డి

చరిత్రలో 13 మంది ప్రధానులను చూశాం కానీ.. మోదీలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని సమీక్షలైనా చేసుకోవచ్చుగానీ.. చంద్రబాబు చేస్తే ఎన్నికల నియమావళి అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Apr 20, 2019, 6:12 PM IST

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

భాజపా నేతలను తప్ప మిగతా వారందరినీ కేంద్రం అణగదొక్కాలని చూస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నియమావళి పేరుతో రాష్ట్రంలో పనులను అడ్డుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని సమీక్షలైనా చేసుకోవచ్చుగానీ.. చంద్రబాబు చేస్తే ఎన్నికల నియమావళి అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఆగిపోతే పర్యవసానాలు ప్రజలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కొత్త జీవోలు, విధాన నిర్ణయాలు తీసుకోవద్దనే విషయం ముఖ్యమంత్రికి తెలుసన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును తలుచుకుంటే మోదీకి నిద్రపట్టడం లేదనీ.. ఆయన సీఎం కాకూడదనేది ప్రధాని తాపత్రయమని విమర్శించారు. చరిత్రలో మోదీలాంటి ప్రధానిని చూడలేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి రాష్ట్రంలో అధికారం తెదేపాదే అని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details