ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సీబీఐ విచారణకు కోల్​కతా కమిషనర్ - పశ్చిమబంగ

శారదా కుంభకోణం సహా పోంజీ స్కీంలపై షిల్లాంగ్​ సీబీఐ కార్యాలయంలో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్ విచారణ కొనసాగుతోంది. ​రాజ్యసభ  మాజీ ఎంపీ కునాల్​ ఘోష్​నూ ప్రశ్నించనుంది సీబీఐ.

సీబీఐ విచారణకు రాజీవ్​కుమార్

By

Published : Feb 9, 2019, 4:28 PM IST

సీబీఐ విచారణకు రాజీవ్​కుమార్
పశ్చిమ్​ బంగలో జరిగిన శారదా కుంభకోణం, పోంజీ స్కీంపై సీబీఐ విచారణకు హాజరయ్యారు కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్. గత ఆదివారం పశ్చిమ బంగలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ. దర్యాప్తు సంస్థ విచారణకు హాజరు కావల్సిందేనని సీపీని ఆదేశించింది న్యాయస్థానం. దీంతో షిల్లాంగ్​లో విచారణకు హాజరయ్యారు రాజీవ్​ కుమార్​.

కునాల్​ ఘోష్​కూ సమన్లు

కేసు విచారణలో భాగంగా తృణమూల్​ కాంగ్రెస్​ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్​ ఘోష్​ కూడా షిల్లాంగ్​ కార్యాలయంలో హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సీబీఐ అధికారులు. 2013లో జరిగిన శారదా కుంభకోణంలో రూ.10 వేల కోట్ల వరకు తారుమారయ్యాయి. ప్రధాన నిందితులు సుదీప్త సేన్​, దేబ్జనీ ముఖర్జీలను 2013లో కశ్మీర్​లో అదుపులోకి తీసుకున్నారు.

బంగాల్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న కోల్​కతా ప్రస్తుత కమిషనర్​ రాజీవ్​ కుమార్​ పలు కీలక దస్త్రాలు మాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details