భారత వాయుసేన ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న షినుక్ 47ఎఫ్(ఐ) హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ల విడిభాగాలు గుజరాత్ ముంద్రా నౌకాశ్రయానికి ఆదివారం చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లలో ఒకటిగా షినుక్ గుర్తింపు పొందింది. మొదటి విడతలో నాలుగు హెలికాప్టర్లను సమకూర్చనుంది బోయింగ్.
అమెరికా ఫిలడేల్పియాలోని బోయింగ్ కర్మాగారంలో తయారైన ఈ భాగాలను ఇక్కడ అసెంబుల్ చేయనున్నారు. ఛండీగఢ్‌కు తరలించి పరీక్షల అనంతరం వాయుసేనకు అప్పగిస్తారు.
సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరిలించేందుకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్ పది టన్నుల బరువును సైతం తేలికగా తరలిస్తుంది. ఇంధన సరఫరా, విపత్తు సహాయక కార్యక్రమాల్లో ఇవి బాగా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం వాయుసేన దగ్గరున్న ఎంఐ 26తో పోలిస్తే షినుక్ ఇంధన వినియోగమూ తక్కువే.
భారత్‌కు చేరిన షినుక్ హెలికాప్టర్లు సరిహద్దులకు చేరేందుకు... రవాణా, మౌలిక సదుపాయాల మెరుగుపరుచుకునేందుకు రక్షణ శాఖ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే బోయింగ్ సంస్థ నుంచి 22 అపాచీ, 15 షినుక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది.