పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఎంఈఓ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంఈఓ పాఠశాలకు సంబంధించిన సమగ్ర అవసరాలను నివేదిక రూపంలో అందించాలని కోరారు. అదే సమయంలో దూరప్రాంతం నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా పత్రాలను అందించాలని ఆదేశించారు.
3 కి.మీ దాటితే.. పాఠశాల విద్యార్థులకు రవాణా ఛార్జీలు
విద్యార్ధి వచ్చే ప్రాంతం నుండి పాఠశాలకు 3 కిలోమీటర్లు దూరం దాటితే నెలకు రూ.600 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తామని పాఠశాలల సమన్వయాధికారి శ్రీనివాస్ అన్నారు.
పాఠశాల విద్యార్థులకు రూ.600 రవాణా ఛార్జీలు