విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు రోడ్డు మమతా హోటల్ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి ఆగివున్న కారును ఢీ కొట్టింది. కారు, స్కూల్ బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో బస్సు పక్కకు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు పక్కన ఫుట్‌పాత్‌పై నడుస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గవర్నర్‌పేట ట్రాఫిక్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
అదుపు తప్పిన స్కూల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
విజయవాడలోని ఏలూరు రోడ్డు వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న పాదచారునికి స్వల్ప గాయాలైనాయి.
ఏలూరు రోడ్డు వద్ద బస్సు ప్రమాదం