ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కోస్తాంధ్రలో ఇంకా మండుతున్న ఎండ‌లు - summer

కోస్తాంధ్రలో ఎండతీవ్రత ఎక్కువైంది. వడగాలులు అనూహ్యంగా పెరుగుతున్నాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.. ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరిలో అత్యధికంగా 45.18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

summer

By

Published : Jun 15, 2019, 5:23 PM IST

కోస్తాంధ్రలో భానుడు ఠారెత్తిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో అత్యధికంగా 45.18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, కన్నెమెరకలో... 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 60 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు,.. 202 ప్రాతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 18 వరకు ఎండ తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని ఆర్టీజీఎస్‌ ప్రకటించింది. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గినందున వడగాలులు అనూహ్యంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details