భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో సగటున 45 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ..తీవ్రత ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. మరో రెండు రోజుల పాటు వడగాలులతో కూడిన ఎండలుంటాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. వాతవరణంలో తేమ శాతం తగ్గిందని వివరించింది. ఆరుబయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అయ్యో.. ఇంకా ఎండల తిప్పలు తప్పవా..! - ap news
రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మరో రెండు రోజులు పాటు తీవ్రమైన ఎండలుంటాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.

అయ్యో.. ఇంకా ఎండల తిప్పలు తప్పవా..!