ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రఫేల్​పై యూపీఏ ఒప్పందాన్నే తప్పుబట్టిన కాగ్

రఫేల్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ... ఆ ఒప్పందంపై కాగ్​ నివేదిక పార్లమెంటు ముందుకు వచ్చింది.

By

Published : Feb 13, 2019, 12:57 PM IST

యూపీఏ ఒప్పందాన్నే తప్పుబట్టిన కాగ్

రఫేల్​ ఒప్పందంపై నివేదికను రాజ్యసభలో కంప్ట్రోలర్​​ అండ్​ ఆడిటర్ జనరల్​​ (కాగ్​) ప్రవేశపెట్టింది. యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంతో పోల్చితే ఎన్డీఏఒప్పందంతో 2.86 శాతం ఖర్చు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం కన్నా ప్రస్తుత ఒప్పందంలో ఎక్కువ భద్రతా అంశాలు పొందుపరచారని వెల్లడించింది. దీనిపైనా మరో 17 శాతం డబ్బును ఆదా చేసిందని తెలిపింది.

రఫేల్​పై కాగ్​ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్​ తప్పుబట్టింది. కాగ్​ నివేదికను అస్త్రంగా చేసుకుని విపక్షాలపై విమర్శల దాడి చేశారు అరుణ్​ జైట్లీ. వారి మాటల్లోని నిజానిజాలు బయటపడ్డాయని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details