సౌదీ అరేబియాలో యాజమాని చేత చిత్రహింసలు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసి వీరయ్య ఆచూకీని గుర్తించినట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో బాధితుడిని కలిసినట్లు తెలిపిన రాయబార సిబ్బంది... స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
రంజాన్ తర్వాత భారత్కు అప్పగిస్తామని ఒంటెల యాజమాని హామీ ఇచ్చినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. వీరయ్య తిరిగి ఇంటికి చేరుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్... సౌదీలోని భారత రాయబారి కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
'రంజాన్ తర్వాత భారత్కు వీరయ్య' - VEERAIAH
దుబాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసి వీరయ్య ఆచూకీని భారత రాయబార కార్యాలయం కనుగొంది. బాధితుడిని మాతృదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది.
'రంజాన్ తర్వాత భారత్కు వీరయ్య'