ఎన్నికల వేళ తెదేపాకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వైకాపాలో చేరడం పార్టీని కలవర పెడుతోంది.కోనసీమ ప్రధాన కేంద్రం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు తెదేపాను వీడుతున్నారు.ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీకానున్నారు.
'తెదేపాలో మరో వికెట్' - ycp
తెదేపాకు మరో షాక్... తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు తెదేపాను వీడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో భేటీకానున్నారు.
కొద్దికాలంగా వైకాపా వర్గాలు రవీంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.పార్టీ మారే యోచన లేదని పైకి చెబుతున్నా రవీంద్రబాబు మాత్రం వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే నేడు వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలవనున్నారు.
ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జన్‌రెడ్డి,చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అధికార పార్టీని వీడి వైకాపాలో చేరారు.ఇప్పుడు అమలాపురం ఎంపీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కానుండటంతో తెదేపాను కలవరపెడుతోంది.ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన పందుల రవీంద్రబాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి2014లో అమలాపురం నుంచి తెదేపా తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.