విధివిధానాలు నచ్చకే.. - tdp
జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తెదేపా ఎంపీ పి.రవీంద్రబాబు వైకాపా కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విధివిధానాలు నచ్చకే పార్టీని వీడానన్నారు.
ఎంపీ పి.రవీంద్రబాబు
కోనసీమ ప్రధాన కేంద్రం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు తెదేపాను వీడారు.ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఇప్పుడు పోరాడుతున్నారని...జగన్ ఎప్పటినుంచో పోరాడుతున్నారని రవీంద్రబాబు అన్నారు. ముందు భాజపాతో పొత్తు పెట్టుకొని...ఇప్పుడు వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.