ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పెద్దల సభలో అఖిలేశ్​ దుమారం

అఖిలేశ్​ యాదవ్​ను లఖ్​నవూ విమానాశ్రయంలో అడ్డగించిన ఘటనపై రాజ్యసభ అట్టుడికింది. సభ రేపటికి వాయిదా పడింది.

సభాపతి వెంకయ్య

By

Published : Feb 12, 2019, 11:28 PM IST

Updated : Feb 13, 2019, 10:29 AM IST

సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ను లఖ్​నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా రాజ్యసభలో ఆందోళన చేశారు ఆ పార్టీ ఎంపీలు. ఎస్పీ సభ్యుల నిరసనలతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.

అలహాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడి ప్రమాణస్వీకారానికి వెళ్తుండగా విమానాశ్రయంలో అఖిలేష్​ను పోలీసులు అడ్డుకున్నారు.​
అఖిలేశ్​ అడ్డగింతపై చర్చించాలని సభ ప్రారంభం నుంచే సమాజ్​వాదీ పార్టీ ఎంపీలు డిమాండ్​ చేశారు. అందుకు సభాపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు. ఈ అంశంపై నోటీసులు ఇవ్వనందున చర్చకు అనుమతించలేనని వెంకయ్య తేల్చిచెప్పారు. శూన్యకాల తీర్మానంలో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించాలని సభ్యులకు సూచించారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గకపోవడం వల్ల మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎస్పీ, బహుజన్​ సమాజ్​వాదీ, తృణమూల్​ కాంగ్రెస్​, రాష్ట్రీయ జనతా దల్​ పార్టీల సభ్యులు అఖిలేష్​ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో మరోమారు అరగంట పాటు సభను వాయిదా వేశారు వెంకయ్య. ఆ తర్వాత కూడా సభ్యులు ఆందోళనలు విరమించకపోవడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు.

Last Updated : Feb 13, 2019, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details