ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు: తెదేపా నేతలు

మైదుకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులు..కేవలం రాజకీయ కక్షతో జరిగినవేనని తెదేపా నేతలు ఆరోపించారు. కేంద్ర ఆదేశాల మేరకు సోదాలకు వచ్చిన అధికారులకు ఒక్క రూపాయి కూడా దొరకలేదన్నారు.

పుట్టా సుధాకార్ ఇంట్లో సోదాలు

By

Published : Apr 3, 2019, 11:01 PM IST

పుట్టా సుధాకార్ ఇంట్లో సోదాలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు చేయడంపై రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఆదేశాలు మేరకే అధికారులు సోదాలు చేశారని ఆయన ఆరోపించారు. తెదేపా నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనడానికి ఇది మరో నిదర్శమన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్థులను భయాందోళనలకు గురిచేసేందుకు కేంద్రం పన్నిన పన్నాగమని విమర్శించారు. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో ఏమీ దొరకలేదని స్వయంగా అధికారులే చెప్తున్నారని రమేశ్ అన్నారు.

వైకాపా నేతలు ఓటమి భయంతో... భాజపాతో కలిసి కుట్రలు చేస్తోందని తెదేపా కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇబ్బందులు కల్గించడానికే ఉద్దేశం పూర్వక దాడులని ఆయన అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా తెదేపా ప్రచారాలకు వస్తోన్న భారీ స్పందన చూసి వైకాపా నేతలు ఓర్వలేకపోతున్నారని ఆదినారాయణరెడ్డి అన్నారు.

రాజకీయ కక్షతోనే తన ఇంట్లో ఐటీ దాడులు జరిపారని మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో తెదేపా గెలుపు తథ్యమని తెలిసి...ఆ భయంతో ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇవీ చదవండిప్రొద్దుటూరులో ఐటీ కలకలం.. పుట్టా సుధాకర్ ఇంట్లో సోదాలు

ABOUT THE AUTHOR

...view details