ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వండి' - ఏపీ ఎన్నికలు 2019

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 80 వేల కుటుంబాలకు ఆహ్వాన ఉత్తరాలు రాశానన్న ఆయన..కేంద్రం, రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమావ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది రాహుల్ గాంధీయేనని మరొసారి గుర్తుచేశారు. పార్టీలకతీతంగా తనకు మద్దతు తెలపాలని కోరారు.

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

By

Published : Mar 24, 2019, 6:35 AM IST

Updated : Mar 24, 2019, 12:26 PM IST

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ విషయమై నియోజకవర్గంలోని 5మండలాల్లోని 80వేల కుటుంబాలకు ఆహ్వాన ఉత్తరాలు...తానే స్వయంగా రాసినట్లు ఆయన స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయానికి వచ్చిన రఘువీరా పలువురి నాయకుల్ని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Last Updated : Mar 24, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details