అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరారు. నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఓటు వేయడానికి ఎక్కువ సమయం పట్టడం వలన ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పయ్యావుల కుటుంబం
ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కేశవ్ మాట్లాడుతూ... ఓట్ల పండుగకు పెద్ద ఎత్తున ఓటర్ల రావడం ఆనందం ఉందనన్నారు.
ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కేశవ్ మాట్లాడుతూ...ఓట్ల పండుగకు పెద్ద ఎత్తున ఓటర్లు రావడం ఆనందం ఉందనన్నారు. నియోజకవర్గంలోని పలు కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయన్నారు. చిగలగురికి గ్రామంలో మాక్ పోలింగ్‌లో తెదేపాకి ఓటేస్తే వైకాపాకు పడిందన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఇవీ చూడండి :157 కేంద్రాల్లో రీపోలింగ్‌కు తెదేపా డిమాండ్