ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

''ఆధారాలు లేకుండా నిందించడం సరికాదు''- పాక్​ - జవాన్లు

భారత్​లో జరిగిన ఉగ్రఘాతుకంపై పాకిస్థాన్​ స్పందించింది. ఇది అత్యంత విషాదకర సంఘటనగా పేర్కొన్న పాక్​ ఇందులో తమ ప్రమేయం లేదని తెలిపింది.

''ఆధారాలు లేకుండా నిందించడం సరికాదు''- పాక్​

By

Published : Feb 15, 2019, 6:46 AM IST

పుల్వామా ఉగ్రదాడిపై పాక్​ తొలిసారిగా బదులిచ్చింది. ఇది అత్యంత దిగ్ర్భాంతికర ఘటనగా అభివర్ణించింది. దాడిలో తమ ప్రమేయం ఉందన్న వాదనలను అంతే గట్టిగా తిరస్కరించింది పాక్.

ఎలాంటి దర్యాప్తు లేకుండానే తమను దోషులుగా చిత్రీకరించడం సబబు కాదని పేర్కొంది. భారత మీడియా, ప్రభుత్వం తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని పాక్​ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

జమ్ము పుల్వామాలోని భారత సీఆర్​పీఎఫ్​ జవాన్ల వాహణశ్రేణిపై ఆత్మాహుతి దాడి జరిపింది జైష్​ ఏ మహమ్మద్​ ఉగ్రవాద సంస్థ. ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు.

''ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా పాక్​ ఖండిస్తుంది. విచారణ లేకుండానే భారత్​లో జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందనడాన్ని గట్టిగా తిరస్కరిస్తున్నాం.''
- విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్​ ఫైజల్​.

ABOUT THE AUTHOR

...view details