పాడేరు ఏజెన్సీలో సుమారు 311 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యాత్మకంగానే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ వెబ్‌కాస్టింగ్‌తో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాడేరు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. చాలా దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాలకు హెలికాప్టర్ అడిగామని..అధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు.
విశాఖ మన్యంలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
విశాఖ మన్యం సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాడేరు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గిరిజనులంతా భయపడకుండా వచ్చి ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
: పాడేరు రిటర్నింగ్ అధికారి