హైదరాబాద్ పాతబస్తీ కాలాపత్తర్, ఫలక్నుమాలో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. చేతిలో కొడవలి, కత్తులు పట్టుకొని రోడ్లపై అరుస్తూ.. ఆగి ఉన్న వాహనాల అద్దాలు పగులగొట్టి.. ఓ హోటల్ లోపలికి వెళ్లి అద్దాలను ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి ఇమ్రాన్, ఖాదర్, మరో గుర్తు తెలియని యువకుడు ముగ్గురు కలిసి అరుస్తూ.. హోటల్లోని అద్దాలను పగులగొట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపారు.
పాతబస్తీలో కత్తులతో ఆకతాయిల హల్చల్ - FIGHT
పాతబస్తీలో కత్తులు, కొడవళ్లతో ఆకతాయిలు హల్చల్ చేశారు. ఓ హోటల్లోకి ప్రవేశించి అద్దాలు పగులగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
పాతబస్తీలో కత్తులతో ఆకతాయిల హల్చల్