ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కల్యాణ వైభోగమే...శ్రీ సీతారామ కల్యాణమే...! - cm chandrababu

కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి సీఎం చంద్రబాబు, గవర్నర్ దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున కోదండ రామయ్యకు సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

కల్యాణ వైభోగమే...శ్రీ సీతారామ కల్యాణమే...!

By

Published : Apr 18, 2019, 9:43 PM IST

Updated : Apr 18, 2019, 10:10 PM IST

ముందుగా కోదండ రాముడి ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ వేదిక వద్దకు చేర్చిన పండితులు వేద మంత్రోచ్ఛరణలో కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. ఈ మహాక్రతువు నిర్విఘ్నంగా నిర్వహించేందుకు తితిదే, ప్రభుత్వఅధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిండు పున్నమి చంద్రుడి వెలుగులో ఏకపత్ని వత్రుడైన శ్రీరామ చంద్రుడి కల్యాణ వేడుకను తిలికించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

కల్యాణ వైభోగమే...శ్రీ సీతారామ కల్యాణమే...!
Last Updated : Apr 18, 2019, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details