తెదేపా హయాంలో... పరిపాలన వ్యవహారాలకు కేంద్రంగా ఉన్న ప్రజావేదిక సాక్షిగా.. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీరని అవమానం జరిగింది. ప్రజావేదికలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తిగత సామాన్లను.. ఎలాంటి సమాచారం లేకుండా సిబ్బంది బయటపడేశారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో.. కనీసం తెదేపా నేతలను సంప్రదించకుండా ఈ చర్య తీసుకున్నారు. ముందే సమాచారం ఇచ్చి ఉంటే తామే చంద్రబాబు సామాన్లను తీసుకునివెళ్లేవాళ్లమని తెదేపా నేతలు ఆవేదన చెందుతున్నారు.
చంద్రబాబుకు అవమానం.. సిబ్బంది తీరు వివాదాస్పదం - యనమల
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విషయంలో.. అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సామాన్లను ప్రజావేదిక నుంచి రోడ్డుమీద పడేశారు.
chandrababu
కక్ష సాధింపు చర్యే: యనమల
ప్రతిపక్ష నేత కార్యకలాపాలకు ప్రజావేదికను కేటాయించాలంటూ ఈ మధ్య చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని తెదేపా నేత, మాజీ మంత్రి యనమల గుర్తు చేశారు. ప్రజావేదిక నుంచి చంద్రబాబు సామాన్లను రోడ్డుపై పడేసిన ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదిక ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సిందన్నారు. సుమోటోగా స్వాధీనం చేసుకోవడం కక్షసాధింపు చర్యే అని స్పష్టం చేశారు. కావాలనే ఈవిధంగా చేశారన్నది స్పష్టమవుతోందన్నారు.