ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నిట్​లో ప్రాంగణ నియామకాల సందడి

రాష్ట్రంలోని నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో మొదటి ప్రాంగణ నియామకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి బ్యాచ్ కావడం వల్ల... ప్రాంగణ ఎంపికలపై అనుమానాలు ఉండేవి. ఈ అనుమాలు పటాపంచలు చేస్తూ... పలు కంపెనీలు నియామకాలు చేపట్టాయి. అనేకమంది విద్యార్థులు పేరున్న సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.

By

Published : Jun 1, 2019, 7:38 AM IST

నిట్​లో ప్రాంగణ నియామకాల సందడి

నిట్​లో ప్రాంగణ నియామకాల సందడి
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం... కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో నిట్​ నెలకొల్పింది. అనేక ఇబ్బందులతో పురుడు పోసుకొన్న నిట్​లో మొదటిబ్యాచ్ విద్యార్థులు కోర్సు చివరి సంవత్సరం పూర్తి చేశారు. సాధారణంగా నిర్వహించే ప్రాంగణ నియామకాలు నిట్​లోనూ నిర్వహించారు. మొదటి సంవత్సరం ప్రాంగణ ఎంపికలు కావడం వల్ల... ఎలాంటి ఆదరణ ఉంటుందోనన్న అనుమానంతో నిర్వహించిన అధికారులు... కంపెనీల నుంచి అనుహ్యమైన స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొదటివిడత ప్రాంగణ ఎంపికలోనే 165మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వీరి సరాసరి ఏడాది వేతనం రూ.5.87లక్షలు. కొందరు విద్యార్థులు అత్యధికంగా ఏడాదికి రూ.25లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. ఎక్సేంజర్, ఎల్​ అండ్ టీ, రామ్కో, మేథా, ఫెనిలిక్స్, టాటా గ్రూప్స్, విప్రో, డెలాయిట్, అడ్రాన, వేదాంత, అమెజాన్ వంటి కంపెనీల్లో కొలువులు సాధించారు.

వివిధ విభాగాలకు చెందిన 345మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు హాజరవగా... మొదటి విడత 165మంది ఎంపికయ్యారు. మిగిలినవారిలో వందమందిపైగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. మిగతా విద్యార్థులకు రెండోవిడత ప్రాంగణ ఎంపికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి బ్యాచ్​కు చెందిన మొత్తం విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో ఉద్యోగావకాశాలు పొందుతారని నిట్ డెరెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఆటంకాలు దాటుకుంటూ... ఏపీ నిట్ ప్రాంగణ ఎంపికలు వైపు అడుగులు వేసింది. మొదటి బ్యాచ్ కోర్సు పూర్తిచేసుకొని... ఉద్యోగాల బాటపట్టారు. శాశ్వత క్యాంపస్‌తోపాటు... మరిన్ని వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి :విద్యార్థులను కూలీలు చేసిన విద్యాశాఖ!

ABOUT THE AUTHOR

...view details