చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి- మదనపల్లి మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా మూడు ఆర్టీసీ కొత్త బస్సులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. మొదటిసారిగా తంబళ్లపల్లె శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత తంబళ్లపల్లికు రావడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించారు. వ్యక్తిగత, ఉమ్మడి, గ్రామాల సమస్యలను విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
'ఆర్టీసీ కొత్త సర్వీసులు ప్రారంభం' - madanapalli
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె శాసన సభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం తంబళ్లపల్లెలో పర్యటించారు. రద్దీని తగ్గించేందుకు కొత్తగా మూడు ఆర్టీసీ బస్సులకు పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు.
తంబళ్లపల్లెలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం